chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలి: గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు: 06 10 25:గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, డ్రైన్లపై ఏర్పడిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకపోతే నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం పట్టాభిపురం మెయిన్ రోడ్, అమరావతి రోడ్, విజయపురి కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలి: గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పదేపదే సూచించినప్పటికీ, ఆక్రమణలు తొలగించని వారిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హిందూ ఫార్మసీ కాలేజీ ఎదుట ఉదాహరణ

అమరావతి రోడ్‌లోని హిందూ ఫార్మసీ కాలేజీ ఎదుట డ్రైన్‌పై ఏర్పాటైన ఆక్రమణను ఇప్పటికే మూడుసార్లు తొలగించినప్పటికీ మళ్లీ తిరిగి నిర్మించడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

అధికారులపై మండిపాటు

వార్డు సచివాలయాల వారీగా వర్షపు నీరు కాల్వల్లోకి వెళ్లక ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ తెలిపారు. అయితే, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపులో పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.Guntur: ఒకే ఒక్కడు…. 50 బైక్ లు ఎత్తుకెళ్లాడు

ఈ క్రమంలో 202, 137 నెంబర్ల వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, 137 శానిటేషన్ కార్యదర్శి విధుల్లో లేకపోవడాన్ని గమనించిన కమిషనర్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కు సూచించారు.

ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker