తురకపాలెం గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతుల పట్ల ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం తురకపాలెంలో ఆమె పర్యటించారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తురకపాలెం ఆరోగ్య సంరక్షణకు నిలయం కావాలి. అనారోగ్య పరిస్థితులు నియంత్రణకు స్థానికులు భాగస్వామ్యం కావాలి. ఆరోగ్య స్థితి గతుల సమాచారం పక్కాగా అందించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అనారోగ్య లక్షణాలు ఉంటే స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని చెప్పారు. చివరి పరిస్థితుల్లో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరటం జరుగుతోంది. గ్రామంలో 102 మందికి బిపి, 69 మందికి మధుమేహం ఉన్నట్లు ఎన్.సి.డి సర్వేలో గుర్తించాము. ఇక ముందు ఒక్క మరణం కూడా సంభవించరాదు. అభివృద్ధి పనులకు, వేడుకలకు తురకపాలెం నిలయం కావాలి. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు అందేటట్లు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
1,003 Less than a minute