బాపట్ల, అక్టోబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టరేట్ పరిధిలోని పి.జి.ఆర్.ఎస్ హాల్ లో మంగళవారం ఉదయం శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ హాజరై, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మహర్షి వాల్మీకి మహాత్మ్యం, రామాయణ రచనలో ఆయన పాత్ర, సమాజంపై ఆయన ప్రభావం గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మరియు ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ పి.గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేదికపై మహర్షి వాల్మీకి జీవిత విశేషాలు ప్రస్తావించడముతో పాటు, సామాజిక సమానత్వంపై ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ పలువురు మాట్లాడారు.