తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడని గణేశ్ అనే యువకుడిని యువతి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో చోటు చేసుకుంది. యువతి సోదరుడితోపాటు మరో ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలకలూరుకు చెందిన యువతిని గణేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కోరుతూ గతంలో పోలీసులను కూడా ఆశ్రయించాడు.
1,004 Less than a minute