చీరాల, అక్టోబర్ 8:భారతదేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది చెప్పుతో దాడికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్లో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.దాడికి పాల్పడిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. Bapatla :మాదకద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతున్న ఈగల్ టీం
ఈ కార్యక్రమంలో ఎన్. బాబూరావు, గోశాల ఆశీర్వాదం, లింగం జయరావు, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజాసమాజం తేలికగా తీసుకోకూడదని వారు హితవు పలికారు.