అమరావతి, అక్టోబర్ 8 :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీశైలంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, రహదారి మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి సూచించారు. అవసరమైతే ఇతర జిల్లాల సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచించారు.
అకస్మాత్తుగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి పరిస్థతులు రాకుండా ఉండేందుకు, జాతీయ రహదారులపై ఎస్కేప్ రోడ్లు సిద్ధం చేయాలని సూచించిన మంత్రి, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.