chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

వినుకొండ పట్టణ సీఐగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

పల్నాడు జిల్లా, వినుకొండ:08-10-25:వినుకొండ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బి. ప్రభాకర్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో సేవలందించిన శోభన్ బాబు సాధారణ బదిలీలలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు (పీటీసీ) బదిలీ కాగా, ఆయన స్థానంలో ఇప్పటి వరకు వినుకొండ రూరల్ సీఐగా విధులు నిర్వహించిన ప్రభాకర్‌ను పట్టణ సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఎవరికైనా అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలని పౌరులను కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker