పొన్నూరు సి.హెచ్.సి కి అంబులెన్స్ వచ్చింది. పొన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్సి) లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. ఈ మేరకు బుధవారం నాటికి ఆసుపత్రికి అంబులెన్స్ చేరింది. తన పర్యటనలో పారిశుధ్యం, మెరుగైన వైద్య సేవలు అందించుటకు చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడి అందుతున్న సేవలు పై ఆరా తీశారు. ఆసుపత్రిలో మందులు సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమగు అన్ని మందులు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ఆసుపత్రికి వస్తున్న వ్యక్తులలో పరిశుభ్రత అంశాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారుఆసుపత్రి పర్యవేక్షకులు ఆసుపత్రి లో అందిస్తున్న సేవలను వివరించారు.
1,012 Less than a minute