chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

గుంటూరు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన

గుంటూరు, అక్టోబర్ 8:గుంటూరు నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం సుదీర్ఘంగా తనిఖీ చేశారు. నగరంలోని కాకుమానుగూడ, బీఆర్ స్టేడియం, పీవీకే నాయుడు పెద మార్కెట్, అంబేద్కర్ భవన్, కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం, గోరంట్లలో నీటి పథకం, మానస సరోవరం, నల్లపాడు చెరువు, ఐటీసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించి సంబంధిత అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. మానస సరోవరం, నల్లపాడు చెరువులను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన

పర్యటనలో భాగంగా జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్‌కు, ఆంధ్రా ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ ఎం.వి. చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్లాంట్ కార్యకలాపాలను వివరించారు. ఉత్తమ పనితీరుతో ప్లాంట్ నడుస్తోందని, అన్ని విభాగాల్లో సరైన పద్ధతిలో పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

బీఆర్ స్టేడియంలోని వర్షపు నీరు నిలిచిపోవడం, లైటింగ్ సమస్యలపై జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సింహారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్టేడియంలో మౌలిక సదుపాయాల మెరుగుదల అవసరముందని చెప్పారు.

నల్లపాడు చెరువు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన లేఅవుట్ వల్ల భారీ వర్షాల సమయంలో రహదారి మునిగిపోతుందని స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తూ పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, జలవనరుల శాఖ ఇంజినీర్ వెంకటరత్నం, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker