తిరుపతి, అక్టోబర్ 08:తిరుపతిలో జాతీయ స్థాయిలో సహకార రంగ అభివృద్ధిపై మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. డిజిటలైజేషన్, గ్రెయిన్ స్టోరేజ్, M-PACS విస్తరణ మరియు కోఆపరేటివ్ బ్యాంకింగ్ బలపరిచే అంశాలపై ఈ వర్క్‌షాప్ ఫోకస్ చేయనుంది.
తాజ్ హోటల్లో ప్రారంభమైన ఈ వర్క్‌షాప్‌ను రాష్ట్ర సహకార కమీషనర్ ఎ. బాబు, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. అశీష్ కుమార్ భూటాని, అదనపు కార్యదర్శులు పంకజ్ బన్సాల్, రవీంద్ర అగర్వాల్, సంయుక్త కార్యదర్శులు ఆనంద్ ఝా, రమణ్ కుమార్ కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం వారిని శ్రీవారి విగ్రహాలతో సన్మానించారు.
డా. అశీష్ కుమార్ భూటాని మాట్లాడుతూ – ఇది ఐదవ జాతీయ వర్క్‌షాప్ అని, ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగమన్నారు. ఈసారి కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రెజెంటేషన్లు, ఆన్లైన్ పాల్గొనేవారి ద్వారా దేశవ్యాప్తంగా మారుతున్న సహకార రంగ దిశపై చర్చ జరుగుతుందని తెలిపారు.
వర్క్‌షాప్‌లో సహకార టాక్సీలు, ఇన్షూరెన్స్, డైరీ, విద్య, ఆరోగ్య సేవలు వంటి కొత్త రంగాల్లో సహకారాల విస్తరణపై చర్చించనున్నారు. PACS లను e-PACS లుగా మలచడంలో ఆంధ్రప్రదేశ్ చేసిన పురోగతిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఎ. బాబు, రిజిస్ట్రార్ మాట్లాడుతూ – “సహకార్ సే సమృద్ధి” నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో సహకార రంగాన్ని మరింత బలపరుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం PACS లు CSCలుగా సేవలందిస్తూ, పెట్రోల్ బంక్‌లు, గ్రెయిన్ స్టోరేజ్ గోదాములు వంటి కొత్త మోడళ్లను అనుసరిస్తున్నాయని వివరించారు.
ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సహకార శాఖల ప్రతినిధులు, నాబార్డ్, ఎన్సీడీసీ, స్థానిక జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్, తదితరులు పాల్గొన్నారు.
వర్క్‌షాప్ ముగిసిన అనంతరం, రాబోయే మూడు నెలల కార్యాచరణకు మార్గదర్శక డాక్యుమెంట్ అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సహకారాల మార్గంలో డిజిటల్ మోహం – గ్రామీణ అభివృద్ధికి కొత్త దిక్సూచి అవుతోంది ఈ వర్క్‌షాప్.