ఏలూరు, అక్టోబర్ 8: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకొని ఉచిత విద్య అందించాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు దళిత సేన రాష్ట్ర స్థాయి జిల్లా అధ్యక్షుల సమావేశం బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాశ్ మాట్లాడుతూ –
“రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో భాగంగా, రాష్ట్రంలోని అత్యధిక ఆదాయం పొందుతున్న చైతన్య-నారాయణ విద్యాసంస్థలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. ప్రతి జిల్లాకు 100 మంది చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 2600 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారికి పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలి. ఉచిత విద్య అందించి వారి జీవితాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలని” డిమాండ్ చేశారు.
పేదరిక నిర్మూలన, విద్యలో సమానత్వం లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో మార్పు కోసం ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సేవాతత్వం వల్ల దేవుని ఆశీస్సులు కూడా అందుతాయని అన్నారు.
ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షుడు చీలి మోహనరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దిరుసుఫా కృష్ణమూర్తి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు భూసే అనిల్ కుమార్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు పింగుల ఈదియా పాల్గొన్నారు.