బాపట్ల, అక్టోబర్ 08:బాపట్ల జిల్లాలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల గోదామును జిల్లా కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్, ఐఏఎస్, బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును తనిఖీ చేయాలి,” అని తెలిపారు.
ఈవీఎం గోదాంలో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం అన్ని పార్టీల నేతల సమక్షంలో గోదాంను మళ్లీ సీల చేశారు.
ఈ తనిఖీలో తహశీల్దార్ సలీమా షేక్, కలెక్టరేట్ ఎలెక్షన్ పర్యవేక్షకులు సఫీ అహ్మద్, డిటి శ్రీనివాస్, ఎలెక్షన్ సెల్ సభ్యులు ప్రశాంత్, దుర్గ పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల నుంచి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. రామకృష్ణ, బి ఎస్ పి నేత జి. రాజారావ్, సిపిఎం జిల్లా కార్యదర్శి చి. హెచ్. గంగయ్య, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్.కె. ఫారీద్ మస్తాన్, వైఎస్సార్ పార్టీకి చెందిన మాల్యాద్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్ల బాలాజీ రెడ్డి, జనసేన ప్రతినిధి విజయ్ మాధురి తదితరులు హాజరయ్యారు.