హైదరాబాద్, అక్టోబర్ 9 :
వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ వీక్‌ను పురస్కరించుకొని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రి (Institute of Mental Health) ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్‌తో సమావేశమైన లారా విలియమ్స్||Laura Williams Meets Jr NTR at US Consulate in Hyderabad
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ — ఉస్మానియా మెడికల్ కాలేజ్ సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో “Mental Health is a Universal Human Right” అనే నినాదంతో మానసిక ఆరోగ్య ప్రాధాన్యాన్ని వివరించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు – రవాణా వ్యవస్థ కుప్పకూలింది|| Heavy Rains in Hyderabad – Transportation System Collapses
ఆసుపత్రి డిపార్ట్మెంట్ HOD డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ —“మానసిక ఆరోగ్యం ప్రతి మనిషికి హక్కు. దానిని పట్టించుకోవడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక రోగులపై ఉన్న అపోహలు, ముద్రలు తొలగించాలి” అని అన్నారు.కార్యక్రమంలో భాగంగా వైద్యులు కార్యక్రమంలో భాగంగా వైద్యులు
డాక్టర్ విజయ్ మాథ్యూస్, డాక్టర్ ఒమేష్, డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ రాజీవి, డాక్టర్ ఫర్హీన్, డాక్టర్ నికిత
, విద్యార్థులు ఆసుపత్రి ప్రాంగణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు మానసిక ఆరోగ్యంపై చైతన్యం కల్పించారు. బ్యానర్లు, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.