Guntur News: ముఠా కార్మికులకు కూలీరేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలి
AITUC AGITATION IN GUNTUR
సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులకు కూలీరేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని AITUC రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సివిల్ సప్లయీస్ గోడౌన్ వద్ద ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మెరుపు సమ్మె నిర్వహించటం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని MLS పాయింట్లలో లారీ ఎగుమతి దిగుమతి పనులు నిలిపివేయబడ్డాయని ఆయన తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ముఠా కార్మికులకు కూలీ రేట్ల పెంపుదల అగ్రిమెంటు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో హయాంలో అధికారులతో చర్చలు నిర్వహించడం జరిగిందని, AITUC యూనియన్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయీస్ కార్మికులు దశల వారి పోరాటాల నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత కూటమి మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సారధ్యంలో కూలీ రేట్ల పెంపుదల చర్చలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ చర్చలు జరిగి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీవోని విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు సివిల్ సప్లయీస్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ అగ్రిమెంటు కాలపరిమితి ముగిసి 12 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు పెంపుదల చేసిన కూలీరెట్ల జీవోని విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయీస్ అధికారులు ముఠా కార్మికులకు ఎరియర్స్ తో కూడిన జీఓని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో నిరవధిక సమ్మె చేయటానికి కార్మిక వర్గం సమాయత్నం అవుతుందని ఆయన తెలిపారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ భాగస్వామిగా ఉన్న సివిల్ సప్లైస్ కార్మికుల కూలీరెట్ల పెంపదళ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని అమలు చేయకపోవడం దారుణమని వెంటనే కూలి రేట్ల జీవోని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, జిల్లా అధ్యక్షులు కోట్ల మరియదాసు, ముఠా కార్మికులకు దానం, డేవిడ్, కాంతారావు,సురేష్, బుజ్జి,జాన్ బాబు, మరియబాబు, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.