అమరావతి:10-10-2025:-రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సమర్థవంతంగా వినియోగించే మార్గాలపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో సమావేశమైంది.
ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు.
గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ తరహాలో భారీ భవనాల నిర్మాణాన్ని చేపట్టిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆ నిర్మాణాలను ప్రజలకు ఉపయోగపడేలా ఎలా మలచాలన్న దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఈ క్రమంలో భవిష్యత్ వినియోగానికి సంబంధించిన పలు ప్రత్యామ్నాయాలను కమిటీ లోతుగా చర్చించింది. త్వరలోనే తాము ప్రభుత్వంకు తమ సిఫారసులు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.