అమరావతి:10-10-25:- రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన visionary నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి, పరిపాలన, ప్రజాసేవ అనే రంగాల్లో కొత్త ప్రమాణాలు ఏర్పడ్డాయని మంత్రి పేర్కొన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపకర్తగా గుర్తింపు పొందిన చంద్రబాబు గారు, దూరదృష్టితో కూడిన నాయకత్వం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని కొనియాడారు.
“సాంకేతికత, పారదర్శకత, అభివృద్ధి పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వం అమోఘం. రైతు నుంచి ఐటీ ప్రొఫెషనల్ వరకు ప్రతి ఒక్కరినీ చేరువైన నాయకుడు ఆయన. ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్రామీణాభివృద్ధి, నగరీకరణ, మహిళా సాధికారత — ప్రతి రంగంలో ఆయన చూపిన దిశ రాష్ట్రానికి కొత్త దారి చూపింది,” అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుగా పేర్కొంటూ, “కష్టాలు, ప్రతికూలతల మధ్య అహర్నిశలు ప్రజల కోసమే శ్రమించిన అభివృద్ధి శిల్పి ఆయనే. ఆయన నేతృత్వంలో మంత్రిగా పని చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను” అని మంత్రి భావోద్వేగంగా తెలిపారు.