పెదనందిపాడు మండలంలోని అనపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో అస్వస్థతకు గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు బలసాని కిరణ్, నూరీ ఫాతిమా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. 45 మంది అస్వస్థతకు గురైతే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ప్రాధమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందించని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు.
1,008 Less than a minute