chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

డీఎస్సీ 1998 ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసం పిలుపు

విజయవాడ, గాంధీనగర్:10-10-25:-డీఎస్సీ 1998లో నియమితులైన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ, అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారిక ఉపాధ్యాయుల తరహాలోనే డీఎస్సీ 1998 టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 25 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమ సేవలను క్రమబద్ధీకరించి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“ఈనాటి వరకు ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. మా సేవల్ని రెగ్యులరైజ్ చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయులకు కనీసం రూ.20,000 పింఛన్ అందించాలి. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే. మా కుటుంబాలకు న్యాయం కావాలి” అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

రేపు గాంధీనగర్ ధర్నాచౌక్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి డీఎస్సీ 1998 ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి బి.కామేష్, అప్పలనాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker