chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత

గుంటూరు, అక్టోబర్ 10:పెదనందిపాడు మండలంలోని అనుపర్రు బీసీ బాలుర వసతి గృహంలో ఇటీవల అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత

శుక్రవారం రోజున గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి ఎస్. సవిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిసి పరామర్శించారు. పిల్లల వార్డులో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందించిన సమాచారం మేరకు విద్యార్థుల ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత విలేకరులతో మాట్లాడుతూ, “అనుపర్రు వసతి గృహంలో మొత్తం 108 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం నాడు వీరిలో 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. జ్వరం ఉన్న 16 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొంతమందిని ఇప్పటికే డిశ్చార్జి చేశాం,” అని తెలిపారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ శోచనీయంగా ఉన్నదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనం, ఉత్తమ విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఇటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, గురువారం రాత్రి భోజనం లేదా నీటి కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న ఏసీ కళ్యాణ మండపంలో ప్రాథమిక వైద్యం అందించారని వివరించారు. 18 మందిని జీజీహెచ్‌కు తరలించారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని, వైద్యశాఖను తక్షణమే అప్రమత్తం చేయగా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి. రమణ నేతృత్వంలో మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker