
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీ నుంచి ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ మరియు ‘పల్సెస్‌లో ఆత్మనిర్భర్త మిషన్’ కార్యక్రమాలను ప్రారంభించారు. వర్చువల్ గా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారితీస్తుంది. పప్పుధాన్య ఆత్మనిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా పెద్ద అడుగు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం. ప్రధాని మోదీ దృష్టిలో ప్రతి రైతు సమృద్ధి భవిష్యత్తు చిహ్నం. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది.
ప్రత్యేక జిల్లాలు, వ్యవసాయ అవస్థాపన సౌకర్యాలపై దృష్టిపెట్టి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల పెంపు, నాణ్యతపై దృష్టి, పంట అనంతరం నష్టాలు తగ్గించడం ప్రధాన లక్ష్యం. పప్పు ధాన్యాల ఉత్పత్తి-ఉత్పాదక పెంచటంపై ప్రత్యేక దృష్టి. దేశంలో ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించటం జరిగింది, ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందచేయటంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పప్పుధాన్యాలది ప్రత్యేక స్థానం, ఎంఎస్పీ ధరలు ప్రకటించటం. రైతులకు అధిక దిగుబడి విత్తనాలు, ఆధునిక సాంకేతిక సాయం, మార్కెట్ అనుసంధానం లభించనుంది. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభం. పంట నష్టాలకు భరోసా – మార్కెట్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. రైతులు పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.







