
తెనాలి, అక్టోబర్ 11:అమృత్ 1.0 పథకం కింద తెనాలి పట్టణంలోని 11వ వార్డులో నిర్మితమైన 10 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యాఖ్యలు:
- “మట్టిని ప్రేమించే తెనాలి రైతులకు, శక్తి–యుక్తులు కలిగిన మహిళలకూ, పౌరులకూ నా నమస్కారాలు,” అంటూ ప్రారంభించిన మంత్రి పెమ్మసాని, అభివృద్ధి మరియు ఆరోగ్యంపై దృష్టి సారించారు.
- “ఓట్ల కోసం మాత్రమే పనిచేసే నాయకులు, అభివృద్ధి కోసం పాటుపడే నాయకుల మధ్య తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది,” అన్నారు.
- క్యాన్సర్ బాధితుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆరోగ్యంపై అవగాహన కల్పించని నాయకుల కారణంగా ఈ పరిస్థితులు వచ్చాయి” అని వ్యాఖ్యానించారు.
- గత వైసిపి హయాంలో కేంద్ర నిధులను వాడుకునే అవగాహన లేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినట్లు మండిపడ్డారు.
- తెనాలిలో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, బిఎస్ఎన్ఎల్ స్థల సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా స్పందించారు.
- జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గిందని, డిజిటల్ పేమెంట్లపై అవగాహన పెంచుకోవాలన్నారు.
- “ప్రారంభోత్సవం కాదు, నిర్వహణ కూడా బాధ్యతగా తీసుకోవాలి,” అంటూ ప్రజల పాత్రను గుర్తుచేశారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి వ్యాఖ్యలు:
- “2017లో చంద్రబాబు హయాంలో 10 MLD, 3 MLD STPల పునాది వేసాం. ఇప్పుడు 10 MLD అందుబాటులోకి వచ్చింది,” అని చెప్పారు.
- “ప్రతిరోజూ రూ. 2.80 కోట్ల లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. శుద్ధికి తగిన సాంకేతిక పరిజ్ఞానం అవసరం,” అన్నారు.
- శానిటేషన్ మరియు గార్బేజ్ సమస్యల నివారణకు ఇదొక మైలురాయి అన్నారు.
నాదెండ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు:
- “కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది,” అన్నారు.
- “గత ప్రభుత్వం చంద్రబాబు నిర్ణయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా టిడ్కో ఇళ్లను మూలన పడేసింది,” అంటూ విమర్శించారు.
- 11వ వార్డులో ఏర్పాటు చేసినా, పట్టణంలోని అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగు నీరు శుద్ధి చేస్తామని తెలిపారు.
- “ప్రతినెలా 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకల్లా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం,” అన్నారు.
ఇతర ముఖ్య అతిథులు:
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రా నం హరిబాబు, మునిసిపల్ కమిషనర్ అప్పలనాయుడు, స్థానిక కౌన్సిలర్ రత్నకుమారి, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు







