
విజయవాడ, అక్టోబర్ 12:ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆశయంతో, వీలైనంత త్వరగా దేవాంగ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం అందించనున్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వాటిని త్వరితగతిన అమలు చేయాలని కోరారు. అలాగే చేనేత వృత్తిలో ఉన్నవారికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలిపారు.దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ, చేనేత వృత్తిలో ప్రధానంగా ఉన్న దేవాంగ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం జరగాలని, విమర్శకుల నోరిమ్మడేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీ వర్గాలు అండగా నిలుస్తున్నాయని, అందులో దేవాంగ సామాజం ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌లకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు కమిటీల్లో దేవాంగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్‌చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షులు మన్నెముద్దు శ్రీనివాసులు, గుంటూరు దేవాంగ సంఘ అధ్యక్షులు వేమన దుర్గారావు, కార్యదర్శి కాలేపు సత్యనారాయణ, నక్కిన వీరభద్రరావు, సీనియర్ నాయకులు మచ్చ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.







