
విజయవాడ: 13.10.2025:-కె.ఎస్. విశ్వనాథన్ ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కొత్త సంచాలకులుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 8:45 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఇంతకుముందు ఈ పదవిలో పనిచేసిన హిమాన్షు శుక్లా ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ కాగా, తాత్కాలికంగా ఈ శాఖ అదనపు బాధ్యతలను ప్రఖర్ జైన్ నిర్వర్తించారు. విజయవాడలో దసరా ఉత్సవాల ఘనతా ప్రణాళిక|| Grand Dussehra Festival Plans in Vijayawada
తాజాగా విశాఖ మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) కమిషనర్‌గా ఉన్న కె.ఎస్. విశ్వనాథన్‌ను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రశాంతమైన స్వభావం, నిర్వాహక నైపుణ్యంతో గల విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నరసాపురం సబ్ కలెక్టర్‌గా, అలాగే ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా సేవలు అందించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం, నూతన సంచాలకుడు శాఖ అధికారులతో సమావేశమై విభాగాల నిర్వహణ, ప్రస్తుత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విశ్వనాథన్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు, శుభాకాంక్షలు తెలియజేశారు.







