
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొద్ది సేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న ఆయన, ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కర్నూలులో జరగబోయే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు.
అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్‌లో గూగుల్ సంస్థతో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ స్థాపనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల మధ్య జరగబోయే ఎంఓయూ కార్యక్రమంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక రంగ పురోగతికి దారితీసే పలు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.







