
ప్రజల ప్రాణాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని సారా ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు. కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేట ఎక్సైజ్ డిసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్, నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేశారని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందించిందని స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగితే పైకి పోవడం ఖాయం అన్నారు. కల్తీ మద్యం అరికటటాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.







