బాపట్ల, జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలం దించి సంతృప్తి చెందాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారు లదగ్గరకు సమస్యలను చెప్పుకోవడానికి వస్తారని అధికారులు సావధానంగా విని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ ,పోలీస్, సర్వే శాఖలకు సంబంధించి న అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని సమస్యలు పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయిలోప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా పాల్గొనా లని ఆయన చెప్పారు. సంతమాగులూరు మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని వాటిని పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు. ప్రజా సమస్యలను పరిశించడానికి తాను మారుమూల గ్రామాలకు సైతం పర్యటిస్తానని ఆయన సందర్భంగా చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కరించడం లో నిర్లక్ష్యంగా ఉన్న గ్రామీణీ నీటి సరఫరా శాఖ ఎస్.ఇ కి,ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గైర్ హజర్ అయిన ఆర్.బి శాఖ ఎస్.ఇ కి సంజాయిషీ నోటీసులు జారీ చేయవలసిందిగా అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పధకం క్రింద 7 సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని సబ్ స్టేషన్లు నిర్మించడానికి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఈనెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు సి.పి ఆర్ వారోత్స వాలను నిర్వహించా లని కలెక్టర్ అన్నారు. అత్యవసర సమయా ల్లో ప్రజలను ప్రాణా పాయo నుండి రక్షించడానికి ప్రతి ఒక్కరూ సి.పి.ఆర్ గురించి తెలుసు కోవాలని అన్నారు. ఈసందర్భంగా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి సి.పి.ఆర్ గురించి అధికారులకు డెమోను ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, కె. ఆర్.సి డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధా మాధవి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
1,004 1 minute read







