BREAKING NEWS – GUNTUR CITY POLITICS: గుంటూరు మేయర్ కి పదవీ గండం…
POLITICAL GAME IN GUNTUR
గుంటూరు మేయర్ కావటి మనోర్ నాయుడుకి పదవీ గండం పొంచి ఉంది. సాధారణ ఎన్నికల ముందే కొంతమంది వైసీపీ కార్పోరేటర్ లు టీడీపీలో చేరారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల మార్పు జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం మరికొందరు వైసీపీ కార్పోరేట్ లు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారిపోయారు. అదేవిధంగా గుంటూరు కార్పోరేషన్ లో కూడా వైసీపీ పాలకవర్గాన్ని ఇంటికి పంపే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఇందుకు కమీషనర్ తో వివాదం, ఈలోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రావడంతో పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు సమక్షంలో 31వ డివిజన్ కార్పోరేటర్ అందుగుల సంతోష్, 40వ డివిజన్ కార్పోరేటర్ ఏరువ సాంబిరెడ్డి టీడీపీలో చేరారు. దీంతో మనోహర్ నాయుడిని మేయర్ పదవి నుండి దించేందకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పైగా కమీషనర్ కి తాము అండగా వున్నామని, మేయర్ మనోహర్ ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యేలు చెప్పడం రాజకీయపరమైన చర్చలకు మరింత బలం చేకూరుతోంది. రానున్న నెల రోజుల్లో గుంటూరు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.