
విజయవాడ, గాంధీనగర్:13-10-25;-రాష్ట్రంలో కాపు, బలిజ సామాజిక వర్గాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
“దాడులకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మీనాయుడుకు హత్యకు ముందు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ముఖ్యమంత్రి intervention అవసరముందని అన్నారు.జేఏసీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన, కాపు వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాపు జేఏసీ ఉద్యమాలకు దిగాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.







