
బాపట్ల జిల్లా:వేమూరు:13-10-25:-వేమూరు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి వరకూటి అశోక్ బాబు నేతృత్వంలో ఈ ర్యాలీ వేమూరు రైల్వే గేట్ నుండి స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగింది.
ర్యాలీ ప్రారంభంలో వైయస్సార్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కూటమి నేతల庩**తృత్వంలోనే కల్తీ మద్యం పెద్ద ఎత్తున సరఫరా అవుతోందని ఆరోపించారు. దీని వల్ల పేదవర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, అనేకమంది ఆరోగ్యపాలవడంతో పాటు మరికొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు.ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కల్తీ మద్యం సరఫరాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు నిరసనగా తోపుడు బండ్లపై మద్యం సీసాలు పెట్టి ప్రదర్శన చేశారు. మద్యం విక్రయానికి అనుమతించే పర్మిట్ రూంలను, గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను నిషేధించాలంటూ నినాదాలు చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేదని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మద్యం షాపులను తమ పార్టీ నాయకులకు అప్పగించి, లాభాల కోసం కల్తీ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ర్యాలీ అనంతరం ఎక్సైజ్ కార్యాలయాన్ని కలిసిన నేతలు సీఐకి వినతిపత్రం అందజేశారు.







