
అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలుపై సంబంధిత అధికారులతో మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా తదితర సందర్భాల్లో ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు, అవాంచిత సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అమలు అధికారులు పక్కాగా వ్యవహరించాలని, వారు చేపట్టిన అంశాలను ప్రజలకు తెలియజేసి చేపడుతున్న పర్యవేక్షణ పట్ల విశ్వాసం కల్పించాలని ఆదేశించారు.
అనధికార బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా తదితర అంశాలపై స్పష్టమైన నిఘా, సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. రెవిన్యూ, పోలీస్, విపత్తులు – అగ్నిమాపక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖలు సమష్టిగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనధికార బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా గుర్తిస్తే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ అంశాన్ని తీవ్రంగానే పరిగణించాలని, ఎటువంటి అలసత్వం ఉండరాదని అన్నారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని చెప్పారు. దీపావళి ప్రతి కుటుంబానికి వెలుగులు నింపి, సుఖశాంతులు కలుగజేసేదిగా మాత్రమే ఉండాలని అన్నారు. ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనుటకు అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. దుకాణాల ఏర్పాటుకు 17వ తేదీ వరకు ధరఖాస్తులు సమర్పించాలని, అనుమతులు లేకుండా బాణాసంచాలు విక్రయించరాదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. క్రింది మార్గదర్శకాలు పాటించాలి*దీపావళి పండుగ సందర్భంగా విక్రయదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
భారత ప్రభుత్వ సంస్థ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్, పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ పేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) (నాగ్పూర్) దీపావళి పండుగ సందర్భముగా బాణాసంచా కాల్పు విషయమై ఈ క్రింది మార్గదర్శకాలను నిర్దేశించడం జరిగిందని, వాటిని పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. చేయదగినవి (DOs)*1. లైసెన్స్కలిగి ఉన్న విశ్వసనీయ అమ్మకందారుల నుండి బాణసంచా కొనుగోలు చేయాలి2. బాణసంచా వినియోగాన్ని ఎల్లప్పుడూ పెద్దలు పర్యవేక్షించాలి3. బాణసంచాపై ముద్రించవబడిన భద్రతా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి4. బాణసంచా కాల్చడానికి కొవ్వొత్తి లేదా అగర్బత్తిని వాడవలెను5. ప్రారంభ మంటలను ఆర్పడానికి ఎల్లప్పుడూ ఒక బకెట్ నీటిని అందుబాటులో ఉంచండి6. ఏరియల్ బాణసంచాను సురక్షిత ల్యాండింగ్ జోన్లో ఉపయోగించాలి7. బాణసంచాను నీటిలో నానబెట్టి వాటిని సరిగ్గా పారవేయండి. చేయకూడనివి (Donts)*1.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య శబ్దాలను వెదజల్లే బాణాసంచా పేల్చవద్దు2. బాణాసంచాను చేతిలో పట్టుకొని కాల్చవద్దు. వాటిని క్రింద పెట్టి, ఆపై వాటిని మండించి, దూరంగా నడవండి3. బాణసంచా కాల్చడానికి ఏదైనా కంటైనర్లో పెట్టవద్దు4. ఏదైనా పనిచేయని బాణాసంచాను విడిచిపెట్టవలెను5.బహిరంగ ప్రదేశంలోకి వెళ్ళే పథంలో అంతరాయం కలిగించే కట్టడముల ప్రవేశం, కిటికీలు దగ్గర ఎప్పుడూ ఏరియల్ (ఓవర్ హెడ్ అడ్డంకులు చెట్లు, ఆకులు, తీగ మొదలైనవి) బాణసంచా కాల్చవద్దు. భవనం/ఇండ్లు, కిటికీల వద్ద ఇతర బాణసంచా కాల్చకండి. ఓపెన్ గ్యారేజ్ డోర్/ విండో ఏరియల్ బాణసంచాను లోపలకు ఎగరడానికి అవకాశం ఇస్తుంది6.ఇంటి లోపల ఎప్పుడూ బాణసంచా ఉపయోగించవద్దు7. బహిరంగ మార్గంలో కాకుండా ఆరుబయట బాణాసంచా ఉపయోగించండి8. ఎప్పుడూ బాణసంచాతో ప్రయోగాలు చేయవద్దు లేదా స్వంతంగా బాణసంచా తయారు చేయవద్దు9. వెలగని బాణసంచాని మళ్లీ వెలిగించవద్దు (15 నుండి 20 నిమిషాలు వేచి ఉండి), ఆపై దానిని ఒక బకెట్ నీటిలో నానబెట్టండి10. నకిలీ బాణాసంచా ఉపయోగించవద్దు11. పిల్లలను ఒంటరిగా బాణసంచా కాల్చడానికి అనుమతించవద్దుప్రజలు, విక్రయదారులు సురక్షిత చర్యలు తీసుకుని దీపావళిని ఆనందంతో, సంతోషంతో జరుపుకోవాలని కోరారు. ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.







