
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు.
దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు చెబుతున్న స్థానికులు. మృతుడు అమర్తులూరు మండలం, కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. చెంచుపేట లో కూతురిని ఇంటికి వచ్చి టిఫిన్ చెయ్యటానికి బయటకు వెళ్లిన మృతుడు.







