
చీరాల, అక్టోబర్ 14:చీరాల మండలం ఓడరేవు బీచ్ సమీపంలో ఈ నెల 12వ తేదీన (ఆదివారం) సాయంత్రం సముద్రం అలలకు ఐదుగురు యువకులు గల్లంతైన దుర్ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు మృతదేహాలు వెలికితీయబడ్డాయి. ఐదో మృతదేహం ఇప్పటికీ కనుగొనబడకపోవడంతో గత మూడు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ గాలింపు చర్యల్లో మత్స్యకారులు, గజఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డిఎఫ్‌ఆర్ (SDRF) బృందాలు డ్రోన్లు, బోట్లు సహాయంతో సముద్రం లో లోతుగా గాలింపు చేపడుతున్నారు.మంగళవారం ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గారు ప్రత్యక్షంగా సందర్శించారు. ఆయనతో పాటు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, పోలీసు, అగ్నిమాపక, రెవిన్యూ, మత్స్య శాఖల అధికారులు ఉన్నారు. బాధిత కుటుంబాలను కలెక్టర్ పరామర్శించి, అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.







