
బాపట్ల జిల్లా: అమృతలూరు:అక్టోబర్ 14:-తక్కువ వేతనంతో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలు అభినందనీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆదిశేషా రత్నం జ్ఞాపకార్థంగా, ఆయన కుమారుడు ప్రభాకరరావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వేతన సిబ్బంది, వైద్యాధికారులు దాతలshown చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఆర్. కోటిరెడ్డి, గ్రంధి సురేష్, రాపర్ల మారుతి వీర రాఘవయ్య, మల్లిపెద్ది సర్వీజి, అమర్తలూరి ఆనందరావు, ఆరెమండ రమేష్ (పులి), కొత్త గోపి, నార్ల భీమయ్య, కర్రా చిరంజీవి, గరికపాటి రాంగోపాల్, ఎం.పి.హెచ్.ఈ.ఓ శ్రీనివాస్ రెడ్డి, పి.హెచ్.ఎన్ కొండమ్మ, హెచ్.వి. జి.వరలక్ష్మి, లెప్రసీ సర్వేయర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.







