
గుంటూరు:14-10-25;- నగరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కార్యదర్శి నక్కల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏటి అగ్రహారం ప్రాంతంలోని మున్సిపాలిటీ కార్మికులకు చీరలు, అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజేత పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగింది.
పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, విజేత పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ హరి, జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు మధులాల్, 29వ వార్డు జనసేన నాయకులు తాడికొండ కిషోర్, ఎర్రబోతుల శివ, 29వ వార్డు టిడిపి అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాసరావు, 30వ వార్డు టిడిపి అధ్యక్షుడు కోరంగి శ్రీనివాసరావు పాల్గొన్నారు.అలాగే గుంటూరు జిల్లా నాయకులు శిఖా బాలు, సతీష్, కొప్పుల కిరణ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా మరియు నగర కమిటీ సభ్యులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ప్రజాసేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. పార్టీ పటిష్టతకు ఇలాంటి సేవా కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.







