
కృష్ణా :పెడన: అక్టోబర్ 15:-కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలోని పడతడిక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా కొనసాగుతోందిప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా నిలువరించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా, కృత్తివెన్ను మండలంలో సుమారుగా 400 సంతకాలను సేకరించాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉప్పాల రాము పాల్గొని, గ్రామస్థుల్ని ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని కోరారు. ఆయన మాట్లాడుతూ, “ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హస్తాల్లోకి వెళ్లకూడదు” అని స్పష్టం చేశారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







