
గుంటూరు, అక్టోబరు 16 : సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ గుంటూరు ఉత్సవ్ ను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ్ జరుగుతుంది. ఉత్సవ్ కు ప్రత్యేకంగా లోగో తయారు చేశారు. జి.ఎస్.టి 2.0 పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏ.సి కళాశాల ఆడిటోరియం హాల్ లో ఉత్సవ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్, అమ్మ కాలు జరుగుతాయి. ఒక గృహంలో వంట గదిలో అవసరమగు పచ్చళ్ళు, పొడులతో సహా గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, జిమ్ ఫిట్నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, కెమిస్ట్ డ్రగ్గిస్ట్, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, ట్రాక్టర్లు తదితర దాదాపు 70 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరుకు చెందిన అక్షయ గో నిధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి సహిత సామగ్రి పలువురిని ఆకర్షించింది.

జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా మాట్లాడుతూ జి.ఎస్.టి తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్య మంత్రి నిర్ణయించడం సంతోషదాయకం అన్నారు. మన రాష్ట్రంలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరగడం శుభదాయకం అన్నారు. సచివాలయ స్థాయి నుంచి కార్యక్రమాలు జరిగాయన్నారు. రైతు సేవా కేంద్రాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలు తదితర అన్ని శాఖల క్షేత్ర స్థాయిలో నిర్వహించామన్నారు. జి.ఎస్.టి తగ్గింపుతో అన్ని వర్గాలకు గొప్ప ఊరట లభించిందని చెప్పారు. నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జిఎస్టి తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు – ఫ్యాకేజింగ్, సెలూన్లు, స్పా, యోగా కేంద్రాలు, జిమ్, టైక్స్ టైల్స్ రంగాల్లో పనిచేసే వారికి, మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికకు సంబంధించిన విద్య, జీవితబీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామర్స్ అండ్ గిగ్ ఎకానమీ, కనస్ట్రక్షన్ మెటీరియల్, టూరిజం – హాస్పిటాలిటీ, టాన్సుపోర్టు, లాజిస్టిక్స్, బొమ్మలు, స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్, మాన్యూఫ్యాక్చరింగ్ రంగాల్లో జి.ఎస్.టి తగ్గుదల ఉందన్నారు. జి.ఎస్.టి తగ్గింపుతో సామాన్య కుటుంబాలకు అత్యంత ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 స్లాబ్ లుగా ఉన్న జి.ఎస్.టిని రెండు స్లాబ్ లుగా తగ్గించిందని చెప్పారు. జి.ఎస్.టి తగ్గింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బలపరుస్తుందన్నారు. చేనేత కళా రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉందని వారికి కేవలం జీరో శాతంతో జి.ఎస్.టి ఉంటుందన్నారు. పుస్తకాలు, స్టేషనరీ, ఇన్సూరెన్స్, వ్యవసాయ పరికరాలు, ఆరోగ్య సంబంధిత సామాగ్రి, తదితర అనేక అశాలపై అతి తక్కువ జి.ఎస్.టి ఉందన్నారు. వాహనాలు ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ధరలు తగ్గడం జరిగిందని చెప్పారు. ప్రతి కుటుంబానికి నెలకు 2 వేల నుండి 10 వేల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. ధరలు తగ్గలేదని పిర్యాదులు రాకూడదని వ్యాపార వర్గాలకు సూచించారు. పిర్యాదులు స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.డిప్యూటీ మేయర్ షేక్ సజీల మాట్లాడుతూ జి.ఎస్.టి తగ్గింపు గొప్ప ఊరట అన్నారు.నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని, తద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలియాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో ఎక్కువ మందిలో అవగాహన వచ్చిందని ఐ.వి.ఆర్.ఎస్ సర్వేలో తేలిందన్నారు. జీఎస్టీలో వచ్చిన పొదుపును మంచి అవసరాలకు ఖర్చు చేయాలని కోరారు.జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతా మాధురి మాట్లాడుతూ ప్రతి వస్తువుపైజీఎస్టీ ధరల తగ్గుదల గమనించాలని ప్రజలను కోరారు.సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిఎస్టి సహాయ కమిషనర్ లు ఆర్.అనసూయ, మల్లిఖార్జున రావు, కార్పొరేటర్ సమత, మెప్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఎ.సి కళాశాల ప్రిన్సిపాల్ మోజెస్, తదితరులు పాల్గొన్నారు.







