
విజయవాడ, అక్టోబర్ 16:-ఇద్దరు భక్తదాతలు ఈ రోజు రాత్రి 8.30 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి విలువైన వజ్రాభరణాలను సమర్పించారు.

మొత్తం 531 గ్రాముల బరువు గల ఈ ఆభరణాల్లో సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, సూత్రాలు, గొలుసు వంటి ప్రత్యేక అభరణాలు ఉన్నాయి. ఇవన్నీ బంగారంతో తయారు చేసి, విలువైన వజ్రాలను జతచేసి ఆలయానికి అందజేశారు.
ఈ ఆభరణాలను ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వాహణాధికారి (ఈవో) శ్రీ శీనానాయక్లకు దాతలు హస్తాంతరం చేశారు

.ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి శ్రీమతి లక్ష్మి రవి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీ గోకరాజు గంగరాజు, శ్రీ కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలరీ డైరక్టర్ శ్రీ సూరజ్ శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు

.అమ్మవారి ఆలయానికి ఈ రకమైన విలువైన దానాలు అందటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







