
విజయవాడ, అక్టోబర్ 16:తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ప్రముఖ కవి, ‘ఎక్స్ రే’ సాహిత్యసేవా సంస్థ వ్యవస్థాపకుడు కొల్లూరి గురువారం రాత్రి 7 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా కాలికీ సంబంధించి చికిత్స తీసుకుంటూ, డయాలసిస్ పై ఆధారపడి జీవిస్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగం వదిలి పత్రికాసేవలోకిఆంధ్రా బ్యాంక్‌లో అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కొల్లూరి, మద్రాసులోని ‘చిరంజీవి’ పత్రికకు సంపాదక బాధ్యతలు స్వీకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా త్యజించారు. ప్రముఖ దర్శకుడు, రచయిత విజయబాపినీడు ప్రోత్సాహంతో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. 1993లో విజయవాడకు వచ్చి అంజలి వారపత్రికను నిర్వహించారు.మినీ కవితల ఉద్యమానికి ప్రాణప్రతిష్ఠతెలుగు సాహిత్యంలో మినీ కవితల ఉద్యమానికి ప్రాణం పోసిన కొల్లూరి, ‘ఎక్స్ రే’ పత్రిక ద్వారా నూతన కవిత్వానికి వేదిక కల్పించారు. మహాకవి శ్రీశ్రీ కూడా ఆ పత్రికకు చందా పంపినట్లు చారిత్రక సమాచారం. సాహితీ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నెలనెలా సాహిత్య కార్యక్రమాలు, పదేళ్లుగా ‘ఎక్స్ రే అవార్డులు’ ప్రారంభించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.సాహిత్య సేవలతోపాటు సామాజిక కార్యకలాపాలుకేవలం సాహిత్యంలోనే కాదు, సమాజంలోని అన్ని రంగాల్లో సేవా తత్పరుడిగా నిలిచిన కొల్లూరి, కోవిడ్ కాలంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి తాపత్రయంలో వందలాది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు
లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి చార్టర్ అధ్యక్షులుగా, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్‌గా, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా ఎంతో చురుకుగా సేవలందించారు.శ్రీశ్రీ విగ్రహం ఏర్పాటులో కీలక పాత్రకమ్యూనిస్టుల కంచుకోట విజయవాడలో మహాకవి శ్రీశ్రీకి విగ్రహం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 2010లో శ్రీశ్రీ శతజయంతి సభలను ఘనంగా నిర్వహించారు.పలువురు ప్రముఖుల శోకసందేశాలుకొల్లూరి ఆకస్మిక మృతి పట్ల నగరంలోని సాహితీవేత్తలు, రచయితలు, ప్రచురణకర్తలు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ప్రాణదాతగా నిలిచిన మానవతామూర్తి2010లో సెలబ్రల్ మలేరియా బాధితుడిగా మృత్యువుతో పోరాడుతున్న రచయిత డాక్టర్ సశ్రీకి అరగంట వ్యవధిలో నాలుగు ప్లేట్‌లెట్ ప్యాకెట్లు అందించి ప్రాణాలు కాపాడిన ఘనత కొల్లూరిగారిదే. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ పదవికి అభిప్రాయం చెప్పి స్నేహానికి న్యాయం చేసిన మానవతా మూర్తి.చివరి వీడ్కోలువిజయవాడలోని ఏలూరు రోడ్డుపై రామ్మందిరం సమీపంలో ఆదాం వాచీ కంపెనీ పక్కనే కొల్లూరి స్వగృహంలో ఆయన పార్థివ దేహం తుది దర్శనార్థం ఉంచారు. సాహిత్య సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కొల్లూరికి చివరి కైమోడ్పు అర్పించేందుకు సాహిత్యాభిమానులు, కవులు, స్నేహితులు తరలివస్తున్నారు







