
గుంటూరు, అక్టోబర్ 16:-రైతులు వ్యవసాయ, ఉద్యాన మరియు పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, అధిక దిగుబడుల ద్వారా ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మైక్రో ఇరిగేషన్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగు సాగుతున్న పంటల వివరాలు, వాటి దిగుబడులు, రైతులకు అందుతున్న సబ్సిడీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
విభాగాల వారీగా వివరాలివీ:
- వ్యవసాయ & ఉద్యాన శాఖ: వివిధ పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడి లాభాలపై విశ్లేషణ.
- పశు సంవర్ధక శాఖ: పశుగ్రాసం సరఫరా, వైద్య సేవలు, పాడి పరిశ్రమ ద్వారా రైతులకు లాభాలపై సమాచారం.
- ఏపీఏంఐపి: మైక్రో ఇరిగేషన్ పథకాల కింద రైతులకు అందించిన డ్రిప్, స్ప్రింక్లర్ యూనిట్ల వివరాలు.
- కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ఖరీఫ్ 2025-26 సీజన్‌కు ముందుగా స్పష్టమైన కార్యాచరణతో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు ప్రాతినిధ్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడానికిప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, పశు సంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, ఏపీఏంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు.







