
చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మోతాదకలోని కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, AICTE–VAANI స్పాన్సర్‌షిప్‌తో “భవిష్యత్తు స్మార్ట్ సిటీస్ & ఇంటెలిజెంట్ మొబిలిటీ” అనే అంశంపై ద్విరోజుల సెమినార్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పి. బంగారు బాబు , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వారంగల్ (NITW) లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ (HOD) మరియు ప్రొఫెసర్ (HAG) హాజరయ్యారు. ఆయన వాహన డైనమిక్స్, ఫినైట్ ఎలిమెంట్ అనాలిసిస్, మరియు కంపన నియంత్రణ రంగాల్లో ప్రసిద్ధ నిపుణులు.
సెమినార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. కె. నాగ శ్రీనివాస రావు గారు, శాఖాధిపతి శ్రీ జి. రామచంద్ర రావు , మరియు కోఆర్డినేటర్ డా. పి. నాగ మల్లేశ్వర రావు పాల్గొని ముఖ్య అతిథిని గౌరవపూర్వకంగా సత్కరించారు.
ఈ సెమినార్‌లో స్మార్ట్ సిటీస్ అభివృద్ధి, ఆధునిక రవాణా సదుపాయాలు, మరియు ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థల ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు దిశలపై వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని చర్చలు, ఉపన్యాసాలు, మరియు ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. ఇక్కడ క్లిక్ చేయండి : చదవండి :chalapathi institute of engineering and technologyచలపతి ఇంజినీరింగ్ కాలేజీలో టెక్ ఫెస్ట్ ఘనంగా
సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం — భవిష్యత్తులో సుస్థిర, స్మార్ట్ నగరాల రూపకల్పన, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మరియు విద్యార్థులలో పరిశోధన, ఆవిష్కరణల పట్ల అవగాహన పెంపొందించడం.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. కె. నాగ శ్రీనివాస రావు మాట్లాడుతూ, “ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలకు ప్రేరణనిస్తాయి. స్మార్ట్ సిటీస్ వంటి ప్రాజెక్టులు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి,” అని అన్నారు. క్లిక్ చేయండి : చదవండి Chalapathi Institute of Technology(Autonomous) CITY College Rd, Mothadaka, princepal #engineeringఏఐ, ఎంఎల్ కోర్సులపై విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది#engineeringadmissions #futuretechnology #citynewstelugu
చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మోతాదక — సమగ్ర విద్య, సాంకేతికత, మరియు పరిశోధన రంగాల్లో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతూ, విద్యార్థులను భవిష్యత్తు సాంకేతికతలకు సన్నద్ధం చేయడంలో కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.







