
గుంటూరు, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (APSPF) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నాయి.

అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ పోటీలలో భాగంగా, ఈ రోజు (అక్టోబర్ 17) నిర్వహించిన వాలీబాల్ ఫైనల్లో విజయవాడ జోన్ జట్టు విజేతగా నిలిచింది. రాజమహేంద్రవరం జోన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో SPF విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డి.ఎన్.ఎ. భాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడమైంది.క్రీడల ద్వారా బలమైన శారీరక సామర్థ్యంతో పాటు, జట్టు సంస్కృతి, సమన్వయం పెంపొందుతుందని అధికారులు పేర్కొన్నారు.







