
గుంటూరు, అక్టోబర్ 17:పాత గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. SBI PO ప్రీలిమ్స్ 2025 ఫలితం విడుదల — ప్రిప్లిమ్స్ తర్వాతి దశకు ఒక నూతన జాబితా||SBI PO Prelims 2025 Result Declared — A New Chapter Begins
ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ ఎం. కిషోర్ కుమార్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మేనేజర్ గిరిబాబు, పాత గుంటూరు శాఖ మేనేజర్ ఎన్. లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మరణించిన వ్యక్తి నామినీకి ఈ భీమా మొత్తాన్ని నేరుగా అందజేస్తారని వారు చెప్పారు. ప్రజలందరూ ఈ పథకం గురించి అవగాహన పెంచుకుని తప్పనిసరిగా ఇందులో చేరాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా సంగడిగుంటకు చెందిన లబ్ధిదారు షేక్ అస్రఫ్ ఉన్నీసా కుటుంబానికి రూ. 2 లక్షల పరిహార చెక్కును శుక్రవారం అందజేశారు. యెస్ బ్యాంక్‌లో భాగస్వామ్య విక్రయం: బ్యాంకుల వాటాలు తగ్గింపు||Yes Bank Stake Sale: Banks Trim Holdings
ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని, ఇలాంటి భీమా పథకాలు ఆ సమయంలో ఆర్థిక భరోసానిస్తాయని అధికారులు తెలిపారు. బ్యాంకులు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.








