- గుంటూరులో ప్రజా సంఘాలు, సాక్షి సిబ్బంది నిరసన
గుంటూరు, అక్టోబర్ 17: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై అలాగే సాక్షి దినపత్రిక విలేకరులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ గుంటూరులో శుక్రవారం నిరసన తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమం గుంటూరు ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ప్రజా సంఘాలు, సాక్షి డెస్క్ సిబ్బంది, సర్కులేషన్ విభాగం, యాడ్స్ విభాగం, అలాగే విలేకరుల బృందం ఐకమత్యంగా పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. Job Opportunity in Hyderabad – City News Telugu Cable Channel Hiring Marketing Executives | ₹25,000 + Incentives

వారు మాట్లాడుతూ, మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. విలేకరులపై దాడులు, బెదిరింపులు చేయడం తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తరువాత వారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. JOB IN AP📢 CITY NEWS TELUGU –✅ రీజినల్ ఇన్‌ఛార్జీలు✅ మార్కెటింగ్ మేనేజర్లు✅ మార్కెటింగ్ ఆఫీసర్లు :అభ్యర్థులు కావలెను ఈ నిరసనలో ఎడిషన్ ఇంచార్జి తిరుమల రెడ్డి , సాక్షి టీవీ జిల్లా ఇంచార్జి అశోక్ ,వెంకట రెడ్డి (DGM ADVT ), బ్రాంచ్ మేనేజర్ గోపి, మేనేజర్ సత్యన్నారాయణ, డిప్యూటీ సర్క్యూలేషన్ మేనేజర్ అబ్దుల్లా , తెనాలి RC ఇంచార్జి , బి ఎల్ నారాయణ , కిరణ్ , శ్రీనివాస్ , సుభాని , జానీ , రవీంద్ర , యాసిన్ , చంద్ర , బుజ్జిబాబు , నాగరాజు , నాగశేఖర్ , అన్ని విభాగాలు ప్రతినిధులు తం నిరసన తెలియజేసారు.







