
Sri Sathya Sai :పుట్టపర్తి, అక్టోబర్ 17:జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం రాత్రి పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, విద్యా సదుపాయాలు, మరియు ఇతర సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా చదువుకొని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు.

“ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం కృషి చేస్తోంది. మీరు కష్టపడి చదివి విజయాలను సాధించాలి” అని కలెక్టర్ గారు విద్యార్థులను ఉత్సాహపరిచారు.తదుపరి రాత్రి అదే వసతి గృహంలో బస చేసిన కలెక్టర్ గారు, విద్యార్థుల దైనందిన జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించారు
వసతి గృహంలో పరిశుభ్రత, భోజన మెనూ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెన్ టి. విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.







