
Guntur:తాడేపల్లి:19-10-25:- తాడేపల్లిపట్టణం 4వ వార్డు అధ్యక్షురాలు మేకా పావని అధ్యక్షతన వార్డు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమి రెడ్డి హాజరయ్యారు.సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న “కోటి సంతకాల ప్రజా ఉద్యమం”లో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఇంటికి ఈ సందేశాన్ని తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం రేకెత్తించాలని, సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బందాప రుక్మాంగిరెడ్డి, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి (బాబీ), 4వ వార్డు ఇంచార్జి మేకా అంజిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.







