Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

Australia telegu dayaspora ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్

ఆస్ట్రేలియా:సిడ్నీ :-19-10-25:-“అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం… మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి” అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ హాల్‌లో ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా దీపప్రజ్వలన చేసిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్నారు–
“ప్రపంచంలో తెలుగు వాడి అడుగులేదని చెప్పలేం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మనదే ఆధిపత్యం. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా మీ జోష్‌కి మెచ్చిపోయింది.

తెలుగువారి గుర్తింపుని నందమూరి తారకరామారావు గారు ప్రపంచానికి చాటారు. ఆ ఆలోచనలను నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు.”చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు చూపిన ఐక్యతను గుర్తుచేసిన లోకేష్, “మీరు చూపిన మద్దతే మా కుటుంబానికి బలాన్నిచ్చింది. ఆ రోజు నుంచే ప్రజల సేవకే జీవితాన్ని అంకితం చేయాలనే సంకల్పించాను” అన్నారు.“గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలోకి వచ్చాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కృషి చేస్తున్నాం” అని తెలిపారు. అభివృద్ధి–సంక్షేమం రెండూ ప్రభుత్వ పంథాలో జోడెద్దుల బండిలా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతపురం ఆటోమోటివ్ హబ్‌గా, కర్నూలు రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా, చిత్తూరు–కడప ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌లుగా రూపుదిద్దుకుంటున్నాయని వివరించారు. “గూగుల్ సిటీ ఏపీకి రావడం కేంద్ర సహకారం వల్లే సాధ్యమైంది” అని చెప్పారు.“డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం మనదే – కేంద్రంలో మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్, అమరావతి పనులు – అన్నీ వేగంగా పునఃప్రారంభమయ్యాయి. పోలవరం కూడా ఐదేళ్లలో పూర్తవుతుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.“ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ నాకు కంటే సులభం” అని అభిలషించారు.“గూగుల్ ఎంత ముఖ్యమో, ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం. విదేశాల్లో 75 వేల మంది తెలుగు వారు, 21 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఎప్పుడూ ఏపీ ఎన్ఆర్‌టీ అండగా ఉంటుంది. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే చరిత్రను తిరగరాయవచ్చు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్. జానకీరామన్, ఏపీ ఎన్ఆర్‌టీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవికుమార్, వెంకటేష్ ఎనికేపాటి, కిషోర్ బలుసు, విజయ్ చెన్నుపాటి, నవీన్ కుమార్ నెలవల్లి, విశ్వనాథ్ దాసరి తదితరులు పాల్గొన్నారు.సిడ్నీ “అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం… మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి” అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ హాల్‌లో ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా దీపప్రజ్వలన చేసిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్నారు–
“ప్రపంచంలో తెలుగు వాడి అడుగులేదని చెప్పలేం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మనదే ఆధిపత్యం. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా మీ జోష్‌కి మెచ్చిపోయింది. తెలుగువారి గుర్తింపుని నందమూరి తారకరామారావు గారు ప్రపంచానికి చాటారు. ఆ ఆలోచనలను నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు.”చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు చూపిన ఐక్యతను గుర్తుచేసిన లోకేష్, “మీరు చూపిన మద్దతే మా కుటుంబానికి బలాన్నిచ్చింది. ఆ రోజు నుంచే ప్రజల సేవకే జీవితాన్ని అంకితం చేయాలనే సంకల్పించాను” అన్నారు.“గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలోకి వచ్చాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా కృషి చేస్తున్నాం” అని తెలిపారు. అభివృద్ధి–సంక్షేమం రెండూ ప్రభుత్వ పంథాలో జోడెద్దుల బండిలా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతపురం ఆటోమోటివ్ హబ్‌గా, కర్నూలు రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా, చిత్తూరు–కడప ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌లుగా రూపుదిద్దుకుంటున్నాయని వివరించారు. “గూగుల్ సిటీ ఏపీకి రావడం కేంద్ర సహకారం వల్లే సాధ్యమైంది” అని చెప్పారు.“డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం మనదే – కేంద్రంలో మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్, అమరావతి పనులు – అన్నీ వేగంగా పునఃప్రారంభమయ్యాయి. పోలవరం కూడా ఐదేళ్లలో పూర్తవుతుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.“ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ నాకు కంటే సులభం” అని అభిలషించారు.“గూగుల్ ఎంత ముఖ్యమో, ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం. విదేశాల్లో 75 వేల మంది తెలుగు వారు, 21 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఎప్పుడూ ఏపీ ఎన్ఆర్‌టీ అండగా ఉంటుంది. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే చరిత్రను తిరగరాయవచ్చు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్. జానకీరామన్, ఏపీ ఎన్ఆర్‌టీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవికుమార్, వెంకటేష్ ఎనికేపాటి, కిషోర్ బలుసు, విజయ్ చెన్నుపాటి, నవీన్ కుమార్ నెలవల్లి, విశ్వనాథ్ దాసరి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button