
Nellore:అనంతసాగరం:19-10-25:-అనంతసాగరంలో హజరత్ మహెబూబె సుబహానీ ఖందిలె నూరాని షేక్ అబ్దుల్ ఖాదర్ జీలాని వారి గ్యార్వి షరీఫ్ ఉరుసు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాహ్ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, బాణాసంచా వెలుగులతో కళకళలాడింది.కార్యక్రమానికి గురువర్యులు, పీఠాధిపతులు హజరత్ సయ్యద్ షా సాని సాహెబ్ ఖిబ్లా, హజరత్ సయ్యద్ షా మజీద్ అలీషా ఖాదరి సాహెబ్ హాజరై సలాం, ఫాతెహ్ ఖాని నిర్వహించారు. అనంతరం ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక దువా చేశారు.

తదుపరి భక్తులకు సమారాధన (అన్నదానం) కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు నిర్వహించిన
కాన్ఫరెన్స్ (ఉపన్యాస కార్యక్రమం)లో ఉలమా మౌలానాలు గ్యార్వి షరీఫ్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు.








