
తూర్పుగోదావరి: నల్లజర్ల:19-10-2025:-తూర్పుగోదావరి జిల్లా దళితసేన కార్యాలయంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో దళితసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా దిరిసి పాము కృష్ణమూర్తిని దళితసేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ నియమించారు. సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు వంటి బలహీన వర్గాల హక్కులు, వారికోసం సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయాలని, అలాగే అంబేద్కర్, ఫూలే, జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా కృష్ణమూర్తి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పెంటపాడు మండల దళితసేన అధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, నల్లజర్ల మండల దళితసేన అధ్యక్షుడు దొండపాటి సువర్ణరాజు, నల్లజర్ల మండలం ప్రధాన కార్యదర్శి తాడిగడప నిరీష్, కొండాయిగుంట గ్రామ అధ్యక్షుడు పెనుమాక వీరస్వామి సహా ఇతర దళితసేన కార్యకర్తలు పాల్గొన్నారు.







