
అమరావతి, అక్టోబర్ 19 :-రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.దీపావళి అంధకారంపై వెలుగు విజయం సాధించిన పండుగగా పేర్కొన్న మంత్రి, ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగుతో పాటు ఆశ, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని కోరిన ఆయన, రాష్ట్రం మళ్లీ వెలుగులా ప్రకాశించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైతులు, యువత, మహిళలు, వృద్ధులు తదితర వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని వివరించారు.సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని, సాంకేతికత, విద్య, వ్యవసాయం, పరిశ్రమ తదితర రంగాల్లో ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసం కూటమి ప్రభుత్వానికి బలమని, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగేలా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు మంత్రి అచ్చెన్నాయుడు.







