
మచిలీపట్నం – అక్టోబర్ 21:బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ పరిస్థితులు మరోసారి మార్పు దిశగా సాగుతున్నాయి. నేటి నుంచే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






